ఏపీకి న్యాయం చేయడం చేతకాని ప్రధాని మోదీ ఇక్కడకొచ్చి తిట్టేసి పోయారని, అవాస్తవాలు మాట్లాడి, ప్రజల ముఖాన ఇంత మన్ను, నీళ్లు కొట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు విరుచుకుపడ్డారు. 'గో బ్యాక్' అంటే మోదీని ఢిల్లీకి పొమ్మనో, మళ్లీ అధికారం చేపట్టమనో కాదని, ఢిల్లీ గద్దె దిగి గుజరాత్‌కు పొమ్మని జనం తెగేసి చెబుతున్నారని అన్నారు. మోదీ గుంటూరులో చేసిన ప్రసంగంలో తనపై చేసిన విమర్శలను అంతే దీటుగా చంద్రబాబు తిప్పికొట్టారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచామని మోదీ తనపై విమర్శలు చేశారని, నిజానికి వెన్నుపోటు పొడిచింది తాను కాదని, గురువుకే వెన్నుపోటు పొడిచిన చరిత్ర మోదీదేనని అన్నారు. తనను చేరదీసి ఆదరించిన అద్వానీకి వెన్నుపోటు పొడిచింది మోదీ కాదా అని ప్రశ్నించారు. గోద్రా అల్లర్ల అనంతరం మోదీని తీసేయాలని వాజ్‌పేయి సిఫారసు చేసినప్పుడు అద్వానీనే అడ్డుపడి మోదీని ఆదుకున్నారని, అలాంటి అద్వానీ ఎదురుపడితే నమస్కారం పెట్టే సంస్కారం కూడా మోదీకి లేదని విమర్శించారు.

moidi 09022019 2

మోదీ చెబుతున్నట్టు తాము పార్టీలేమీ మార్చలేదని, ఎన్టీఆర్ పేరు పెట్టిన పార్టీలోనే ప్రజాసేవ చేస్తున్నామని, ఏరోజూ తాము అవకాశవాద రాజకీయాల జోలికి పోలేదని చెప్పారు. 'ఆయన ఛాయ్ వాలా అంటారు. లక్షలు, కోట్ల రూపాయల సూటు, బూటు వేస్తారు. నేను అప్పడూ ఇప్పుడూ ఒకే తరహా డ్రెస్ వేసుకుంటాను. ఎన్నికల్లో ఓడిపోయిన సీనియారిటీ నాకు లేదని మోదీ చెబుతున్నారు. 1994, 96, 98, 99 ఇలా గెలుచుకుంటూ వెళ్లాం' అని చంద్రబాబు అన్నారు. చంద్రబాబుకు తాము గౌరవం ఇచ్చామంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందిస్తూ, మీరా గౌరవం ఇచ్చింది? అంటూ ప్రశ్నించారు. రాష్ట్రానికి న్యాయం చేయమని అడిగామే కానీ, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే, నాకీ పని చేసి పెట్టమనో ఏరోజూ మోదీని అడగలేదని చంద్రబాబు సమాధానమిచ్చారు.

 

moidi 09022019 3

కాంగ్రెస్‌తో చేతులు కలిపారంటూ మోదే చేసిన వ్యాఖ్యలపైనా చంద్రబాబు ఘాటుగానే స్పందించారు. కేంద్రంలోని కాంగ్రెస్‌తో, అప్పటి ప్రభుత్వ దురహంకారంతో తాము ఆనాడు పోట్లాడామని, ఇవాళ అదే స్థానంలో బీజేపీ న్యాయకత్వంలో అన్యాయం జరుగుతుంటే దేశాన్ని కాపాడేందుకు పోరాడితే తప్పేమిటని ప్రశ్నించారు. పోరాడటమే కాదు....ఇంకా గట్టిగా పోరాడతామన్నారు. లోకేష్ తండ్రి చంద్రబాబు అంటూ మోదీ వ్యక్తిగత విమర్శలకు దిగడాన్ని కూడా సీఎం ఎండగట్టారు. 'మీకు కొడుకుల్లేరు. పెళ్లాన్ని వదిలేశారు. కుటుంబం అక్కర్లేదు. అనుబంధాలు, ఆత్మీయతలు తెలియవు' అని మండిపడ్డారు. తాను వ్యక్తిగత విమర్శలకు దూరమని, కానీ మోదీ వ్యక్తిగత విమర్శలకు దిగడంతోనే తాను సమాధానం ఇవ్వాల్సి వచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు.

ఏపీకి ఎంతో చేశామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుంటూరులో చెప్పిన లెక్కలపై సీఎం చంద్రబాబు సమాధానమిచ్చారు. ఆనాడు లోటు బడ్జెట్‌లో ఉన్న ఏపీ ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని, రాజకీయాల కోసం కాదని ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆనాడు బీజేపీతో పొత్తు పెట్టుకోకపోయి ఉంటే మరో 15 సీట్లు గెలిచేవాళ్లమని అన్నారు. ఏపీకి రూ. 3 లక్షల కోట్లు ఇచ్చామని మోదీ చెబుతున్నారని, ఎక్కడ ఇచ్చారు? దేనికి ఇచ్చారని చంద్రబాబు ప్రశ్నించారు. పెత్తందారీ వ్యవస్థను టీడీపీ ఉపేక్షించదన్నారు. ఎదురు ప్రశ్నిస్తే ఐటీ, ఈడీలతో దాడులు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

moidi 09022019 2

బీజేపీ సభకు మనుషులు రారు కాబట్టి.. వైసీపీ నేతలు జనసమీకరణ చేశారని చంద్రబాబు విమర్శించారు. కేంద్రం ఎలాంటి దాడులు చేసినా తాము భయపడేది లేదని, జగన్‌ భయపడుతారన్నారు. రాజధానికి డబ్బులు ఇవ్వరని, పోలవరానికి ఇంకా రూ. 4 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందని, వెనుకబడిన ప్రాంతాలకు రూ. 24 వేల కోట్లు ఇవ్వాలని చంద్రబాబు తెలిపారు. వెనుకబడిన ప్రాంతాలకు డబ్బు ఇచ్చినట్లే ఇచ్చి తిరిగి తీసుకున్నారని ఆరోపించారు. తాము మోదీకి ఊడిగం చేయడం లేదు కాబట్టే నిధులు ఇవ్వడం లేదని చంద్రబాబు మండిపడ్డారు. ఊడిగం చేయడానికి తాము కేంద్రానికి బానిసలం కాదన్నారు. తనపై నమ్మకంతో రైతులు రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చారని సీఎం స్పష్టం చేశారు. రైతులకు ఉన్న స్ఫూర్తి ఈ ప్రధానికి లేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

moidi 09022019 3

గతంలో తనపై మోదీకి ఉన్న నమ్మకం ఇప్పుడు ఏమైందని చంద్రబాబు ప్రశ్నించారు. ఇవ్వడం చేతకాక తనను విమర్శిస్తున్నారని అన్నారు. విభజన హామీలను ఎందుకు అమలు చేయలేకపోయారని చంద్రబాబు, మోదీని సూటిగా ప్రశ్నించారు. మన గడ్డపైకి వచ్చిన ప్రధాని అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. మోదీ ఒక ప్రచార ప్రధాన మంత్రి అని అన్నారు. రాష్ట్రాన్ని దోచుకోవడానికి మోదీ ప్రయత్నిస్తున్నారని, మన గ్యాస్‌ని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. నోట్ల రద్దు వల్ల ఎవరికైనా లాభం జరిగిందా? అని ప్రశ్నించారు. నోట్ల రద్దు పిచ్చి తుగ్లక్‌ చర్యగా చంద్రబాబు అభివర్ణించారు.

 

 

లోకేష్ నామం జపించడానికి ఢిల్లీ నుండి గుంటూరు వచ్చిన భారత ప్రధాని. అవును మీరు వింటుంది నిజం. ఇంతమంది నిరసనల మధ్య వచ్చి ఆంధ్రాకి ఏమైనా హామీ ఇచ్చారా, ఏమైనా ప్రకటన చేశారా, లేదు..చంద్రబాబు, లోకేష్ మీద విమర్శలు చేయడానికైతే..ఒక ప్రెస్ మీట్ పెడితే సరిపోయేది..ఇంత వృధా ప్రయాస ఎందుకు.. లోకేష్ మీద పడి ఏడవడానికి సూటు బూటు వేసుకొని అమరావతి రావలా ? లోకేష్ నామస్మరణ చేసిన జగన్, పవన్ ల తో పాటు, ఆ లిస్ట్ లో మోడీ కూడా చేరిపోయాడు. అవార్డులు ఇచ్చి, ఇచ్చి లోకేష్ అభిమాని గా మారిపోయిన మోడీ! లోకేష్‌గారి తండ్రిగారంటూ చంద్రబాబుపై పదేపదే వెక్కిరింపు వ్యాఖ్యలు చేశారు. ఏపీకి కొత్త హామీలు గానీ, ప్రకటనలుగానీ చేయలేదు.

moidi 09022019 2

విశాఖ రైల్వేజోన్‌, కడప ఉక్కు ఫ్యాక్టరీ లాంటి అంశాలు ఏవీ మోదీ ప్రస్తావించలేదు. ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటే.. గతంలో చంద్రబాబు ఒప్పుకున్నారంటూ ప్రధాని పాత క్యాసెట్టే తిరగవేశారు. మోదీ గోబ్యాక్‌ లాంటి నిరసనలపై ప్రధాని వెటకారాలు చేశారు. ఏపీ పర్యటనకు వచ్చిన ఆయన ఆదివారం గుంటూరులో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఎన్నికల ముందు ఏపీకి కొత్త భరోసా ఏమైనా ఇస్తారా అనే.. అంచనాలను మోదీ ప్రసంగం అందుకోలేకపోయింది. ఏపీకి చాలా ఇచ్చామని, ఇంకా ఇస్తాం అనే మాట మాత్రమే చెప్పిన మోదీ.. రేపు ఢిల్లీలో చంద్రబాబు తలపెట్టిన దీక్షపైనా విమర్శలు చేశారు.

moidi 09022019 3

ఒకసారి బాబు అని, మరొకసారి లోకేష్ తండ్రి అని ఆయన చేసిన సంబోధనేమిటో ప్రజలకు అర్ధం కావటం లేదు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన ప్రధానాంశం రాష్ట్రనికి ప్రత్యేక హోదా డిమాండ్ అంశాన్ని ప్రస్తావిoచకుండా, బిజెపి నేతలు తరచూ పాడే పాత పాట “ప్రత్యేక ప్యాకేజీ పాటను” మోడీ మరోసారి పాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అదనపు నిధులు కేటాయిoపు, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక రైల్వే జోన్ ఊసెత్తని ప్రధాని, గుంటూరుకు ఎందుకోచ్చారో మరి. ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఎద్దేవా చేసేవిధంగా సాగిన ప్రధాని ఉపన్యాసాన్ని ప్రజలు చీత్కరిoచుకున్నారు. ప్రత్యేక ప్యాకేజీ కి 5 లక్షల కోట్లు ఇచ్చామని ఇటీవల అమిత్ షా చెప్పారని, మోడీ ఏమో 3 లక్షల కోట్లు ఇచ్చామని చెప్పుకున్నారు. వారి ప్రకటనల వ్యత్యాసం ఏమిటో మోదినే చెప్పాలి.

ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఎలాంటి బంధాలు లేవని, అసలు ఆయనకు కుటుంబ వ్యవస్థపై గౌరవమే లేదని, మోదీకి భార్య ఉందన్న విషయం ఎవరికీ తెలియదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ట్రిపుల్‌ తలాక్‌ చెల్లదని తెలిసే చట్టాన్ని తీసుకొచ్చారని మండిపడ్డారు. ఇక చంద్రబాబును మోదీ తన ప్రసంగంలో పదేపదే లోకేష్ తండ్రి అనడంపై చంద్రబాబు స్పందిస్తూ ‘నన్ను లోకేష్‌ తండ్రి అన్నారు.. దానికి గర్వపడుతున్నా’ అన్నారు. మోదీ గురివింద చందంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తాము వ్యక్తిగత జీవితాలను వదులుకొని రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేస్తున్నామని, రాష్ట్రానికి రావాల్సిన డబ్బును రాబట్టి తీరుతామని చంద్రబాబు స్పష్టం చేశారు.

cbnquestions 10022019

'మీకు కొడుకుల్లేరు. పెళ్లాన్ని వదిలేశారు. కుటుంబం అక్కర్లేదు. అనుబంధాలు, ఆత్మీయతలు తెలియవు' అని మండిపడ్డారు. తాను వ్యక్తిగత విమర్శలకు దూరమని, కానీ మోదీ వ్యక్తిగత విమర్శలకు దిగడంతోనే తాను సమాధానం ఇవ్వాల్సి వచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. జశోదా బెన్ భర్త మోడీ అని నేను సంబోధిస్తే తలకాయి ఎక్కడ పెట్టుకుంటారు అంటూ ఘాటుగా బదులిచ్చారు. "నా కుటుంబాన్ని చూస్తే నాకు ఎంతో గర్వంగా ఉంది. నా కుటుంబం నా మీద ఆధారపడలేదు. కానీ మీకు కుటుంబం లేదు, బందాలు లేవు, కుటుంబ వ్యవస్థ మీద గౌరవం లేదు, మీ భార్య యశోదాబెన్‌ గురించి మాట్లాడితే మీరు తల ఎక్కడ పెట్టుకుంటారు, గురివింద సామెత మీకు కూడా వర్తిస్తుంది." అని చంద్రబాబు అన్నారు.

cbnquestions 10022019

న్యాయం చేయమంటే దాడి చేస్తారా? అంటూ చంద్రబాబు మండిపడ్డారు. తాము కూడా ఎదురుదాడి చేస్తామని అన్నారు. ఏపీకి కొత్తగా ఏమీ ఇవ్వనక్కర్లేదని, అంతకు ముందు ప్రధాని ఇచ్చిన హామీలను నిలబెడితే చాలన్నారు. ఆ పని కూడా మోదీకి చేతకావడం లేదని ఎద్దేవా చేశారు. తనకు, మోదీకి వ్యక్తిగత విభేదాలు లేవన్నారు. మోదీ హయాంలో గుజరాత్‌లో ముస్లింలను ఊచకోత కోస్తే.. రాజీనామా చేయాలని తానే డిమాండ్‌ చేశానన్నారు. అది మనసులో పెట్టుకుని మోదీ మాట్లాడుతున్నారని ఆరోపించారు. లౌకిక దేశంలో హింసకు తావులేదని, అది మనసులో పెట్టుకుని మోదీ ఇప్పుడు కక్ష సాధిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.

Advertisements

Latest Articles

Most Read