సీఎం చంద్రబాబు దీక్షకు పలు జాతీయ పార్టీల మద్దతు ప్రకటిస్తున్నాయి. చంద్రబాబు దీక్షకు 22 పార్టీల నేతలు మద్దతివ్వనున్నారు. నేషనల్‌ కాంగ్రెస్‌ అధినేత ఫరూక్‌అబ్దుల్లా, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్, శరద్‌యాదవ్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, డీఎంకే నేతల మద్దతిస్తున్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ లేదా ఆయన ప్రతినిధులు దీక్షకు సంఘీభావం తెలుపుతామని చంద్రబాబుకు సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 11న ఢిల్లీలో ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు చంద్రబాబు దీక్ష చేపట్టనున్నారు. ఏపీ భవన్‌లో చంద్రబాబు దీక్ష చేస్తారు. ఏపీకి జరిగిన అన్యాయంపై పార్లమెంట్‌లోనూ నినదించాలని ఇప్పటికే ఆయన నిర్ణయం తీసుకున్నారు.

delhi 09022019 1

ఢిల్లీ వేదికగా ఈనెల 11న నిర్వహించే ధర్మపోరాటాన్ని విజయవంతం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ప్రజలు, ప్రజా సంఘాలంతా రాష్ట్రం వైపు ఉంటే, ప్రతిపక్షాలు మాత్రం రాజకీయాల వైపు ఉన్నాయని ఆయన విమర్శించారు. దీనిని ప్రజలంతా గమనిస్తున్నారని, ఎవరు రాష్ట్రం కోసమో, ఎవరు రాజకీయాల కోసమో ఢిల్లీలో జరిగే ఆందోళనే తేలుస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి ప్రతిపక్షాలను కూడా ఆహ్వానించామని, ఒకవేళ వాళ్లు రాకపోతే ఏం చేయాలో ప్రజలే నిర్ణయిస్తారని హెచ్చరించారు. దీక్షను విజయవంత చేయడానికి ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, ఇన్‌‌చార్జులతో ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

 

delhi 09022019 1

టీడీపీ అఖండ విజయమే ఏపీ భవిష్యత్‌ అని, అన్ని వర్గాల మద్దతు పొందాలని సూచించారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో జరగనున్న ధర్మపోరాట దీక్షలో పాల్గొనేందుకు శుక్రవారం రాత్రి విశాఖ నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ వెళ్లే వారికోసం శ్రీకాకుళం నుంచి 17బోగీలతో వేసిన ప్రత్యేక రైల్లో 2బోగీలు విశాఖ నాయకులకు కేటాయించారు. ఏపి భ‌వ‌న్ ప్రాంగ‌ణంలో సీయం ఈ నెల 11న ఉద‌యం 8 గంట‌ల నుండి రాత్రి 8గంట‌ల వ‌ర‌కు దీక్ష చేయాల‌ని నిర్ణియంచారు. ఇందు కోసం ఏపి నుం డి రెండు ప్ర‌త్యేక రైళ్లు ఏర్పాటు చేసారు. ఈ నెల 12 రాష్ట్రప‌తిని క‌లిసి విన‌తి ప‌త్రం స‌మ‌ర్పిస్తారు.

విభజన గాయాలపై కారం జల్లి ప్రధాని మోదీ పైశాచిక ఆనందం పొందుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎక్కడికక్కడ ఫ్రస్ట్రేషన్ ప్రదర్శిస్తూ మోదీ నోరు పారేసుకుంటున్నారని, రేపు గుంటూరు వచ్చి అదే ఫ్రస్ట్రేషన్ ప్రదర్శిస్తారని సీఎం దుయ్యబట్టారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన వ్యక్తి ఏపీ వచ్చారని దేశమంతా తెలిసేలా నిరసనలు తెలపాలని ఆయన పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు పార్టీ నేతలతో శనివారం ఉదయం ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అంతా పసుపు చొక్కాలు ధరించి ఎక్కడికక్కడ నిరసనలు తెలపాలని కోరారు. గాంధీజీ స్పూర్తితో రేపు, ఎల్లుండి ఒక చీకటి దినంగా భావించి కసి పట్టుదలతో అందరూ నిరసనలు తెలపాలని సూచించారు.

modi 0922019

ఎల్లుండి ధర్మపోరాట దీక్షకు మద్దతుగా స్థానికంగా ఎవరికి తోచిన విధంగా వాళ్లు నిరసనలు తెలపాలన్నారు. చేసిన దుర్మార్గం చూసేందుకు మోదీ వస్తున్నారని, రాష్ట్రంలో మరో వ్యక్తి ఆయనకు సహకరిస్తున్నాడని చంద్రబాబు ఆక్షేపించారు. రాష్ట్రాల్ని అస్థిర పరిచేందుకు కుట్ర పన్నుతున్నారని, ఇందుకు మానసికంగా అన్నిటికీ సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. మొన్న పశ్చిమ బెంగాల్‌లో చేశారు.. రేపు ఇక్కడా చేస్తారని.. దేనికీ అదిరేది లేదని తేల్చి చెప్పారు.

modi 0922019

మోదీ ద్రోహంపై జగన్ ఒక్కమాట అనరని విమర్శించారు. భాజపా, వైకాపా కుమ్మక్కుకు అదే రుజువన్నారు. రఫేల్‌ బురదలో మోదీ కూరుకుపోయారని, దొంగే దొంగా అన్నట్లుగా ప్రధాని వ్యవహారశైలి ఉందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రఫేల్‌ వ్యవహారంలో పీఎంవో జోక్యం దేశానికే అప్రతిష్ఠ అని మండిపడ్డారు. మోదీ అడుగులు ఆంధ్రప్రదేశ్‌ను అపవిత్రం చేస్తాయని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి రెండేళ్లుగా అసెంబ్లీకి రాకుండా వైకాపా 4 సెషన్లకు డుమ్మా కొట్టిందన్నారు. ఇలాంటివాళ్లు ప్రజాసేవకే అనర్హులు, రాజకీయాలకే అనర్హులని తేల్చి చెప్పారు. మాటలు చెప్పే నాయకులకు చరిత్రలో స్థానం లేదన్నారు. అన్ని వర్గాలకూ లబ్ధి చేకూర్చేలా విజన్ డాక్యుమెంట్ రూపొందించామన్నారు. దీన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు.

భాజపా అగ్రనేత అడ్వాణీ వాగ్ధాటి ఎంతటిదో అందరికీ తెలిసిందే. 2012 ఆగస్టు 8న అసోంలోకి అక్రమంగా చొరబడుతున్న శరణార్థుల గురించి లోక్‌సభలో ప్రతిపక్ష నేత అడ్వాణీ ప్రసంగిస్తుండగా.. దాదాపు 50 సార్లు అవాంతరాలు ఎదురయ్యాయి. కానీ ఆయన తన ప్రసంగాన్ని మాత్రం కొనసాగించారు. ఆరోజు తన ప్రసంగంలో దాదాపు 5వేల పదాలను ఉపయోగించారు. మళ్లీ 2019, జనవరి 8న ఎన్డీయే ప్రభుత్వం పౌరసత్వ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. దీనిపై చర్చ జరిగింది. అదే అంశంపై చర్చ జరిగినప్పుడు అడ్వాణీ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

adwani 09022019

గత ఐదేళ్ల కాలంలో అడ్వాణీ లోక్‌సభలో మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. ఆయన కేవలం 365 పదాలు మాత్రమే మాట్లాడారు. అది కూడా 2014లోనే. గత ఐదేళ్లలో ఆయన లోక్‌సభలో మాట్లాడిన సమయం మూడు నిమిషాల కంటే తక్కువే. డిసెంబరు 19, 2014 తర్వాత ఆయన ఒక్కసారి కూడా లోక్‌సభలో మాట్లాడినట్లు రికార్డుల్లో లేదు. 2009 నుంచి 2014 వరకు చూసుకుంటే అడ్వాణీ దాదాపు 42 డిబేట్లలో పాల్గొని 35,926 పదాలు మాట్లాడారు.

adwani 09022019

హాజరు భేష్‌.. అనారోగ్య కారణాల వల్ల అడ్వాణీ చాలా తక్కువ సందర్భాల్లో బయట కనిపిస్తున్నారు. కానీ లోక్‌సభలో ఆయన హాజరు మాత్రం అందరి కంటే చాలా బాగుంది. గత ఐదేళ్లలో ఆయన హాజరు 92శాతంగా ఉంది. 2014 జూన్‌ 4 నుంచి 2019 జనవరి 8 వరకు 16 లోక్‌సభ సెషన్స్‌ జరిగాయి. 321రోజులు సభ నిర్వహించారు. వీటిలో 296 రోజులు అడ్వాణీ సభకు హాజరయ్యారు. మోదీ ప్రభుత్వంలోని మంత్రుల కంటే అడ్వాణీ హాజరుశాతం అద్భుతంగా ఉంది. నిజానికి యూపీఏ హయాంలో కంటే ఎన్డీయే హయాంలో జరిగిన సమావేశాలకు అడ్వాణీ ఎక్కువగా హాజరయ్యారు. 2009 నుంచి 2014 వరకు ఆయన హాజరు శాతం 91.

రాష్ట్రంలో మధుమేహం, అధిక రక్తపోటు వ్యాధులతో బాధపడే వారికి ఇది శుభవార్తే. ఇకపై రోగులు ప్రైవేటు మందుల దుకాణాల్లో బీపీ, షుగర్‌ ట్యాబ్లెట్లు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం కొత్తగా ‘ఉచిత మందుల పథకం’ ప్రకటించింది. నెలకు సరిపడా మందులు ఒకేసారి పొందవచ్చు. రాష్ట్రంలో ఏ ప్రైవేటు రిటైల్‌ మెడికల్‌ షాపులోనైనా రోగులు ఈ మందులు తీసుకునే వెసులుబాటు కల్పించారు. బీపీ, షుగర్‌ రోగులపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. దేశంలో ఈ తరహా పథకం ప్రవేశపెట్టడం ఇదే తొలిసారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఐసీఎంఆర్‌, కలామ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ టెక్నాలజీ సంస్థలు ఇటీవల సంయుక్తంగా ఏపీలో సర్వే నిర్వహించాయి. ప్రైవేటు వైద్యరంగంలో నెలకు రూ.వేలు వెచ్చించి బీపీ, షుగర్‌ మందులు కొనుగోలు చేసే రోగుల కుటుంబాలపై తీవ్ర ఆర్ధిక భారం పడుతున్నట్లు గుర్తించారు. వారికి ఉచితంగా మందులు ఇవ్వడం ద్వారా ఆర్ధిక వెసులుబాటు కలుగుతుందని సిఫార్సు చేశారు. ఈ ప్రతిపాదనను రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ప్రభుత్వానికి పంపగా, ఆమోదించింది.

anna sanjeevini 09022019

రోగుల ఎంపిక ఇలా... ఉచిత మందుల పథకంలో లబ్ధిదారులుగా చేరదలచిన రోగులు తొలుత తమకు ఉన్న బీపీ, షుగర్‌ వ్యాధులను సమీపంలో ఉన్న ప్రభుత్వాస్పత్రుల్లో నిర్ధారణ చేయించుకోవాలి. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ప్రాంతీయ ఆసుపత్రులు, జిల్లా కేంద్ర ఆసుపత్రి, ప్రభుత్వ వైద్య బోధన ఆసుపత్రుల్లో డాక్టర్లు ఈ జబ్బులను నిర్ధారించాలి. ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు (ఈ-యూహెచ్‌సీలు), ఎన్టీఆర్‌ వైద్య సేవ పథకం నెట్‌వర్క్‌ ఆసుపత్రుల వైద్యులు కూడా ఈ వ్యాధులను నిర్ధారించవచ్చు. బీపీ పరీక్షలతో పాటు గ్లైకోజినేటెడ్‌ హీమోగ్లోబిన్‌ పరీక్షలు (షుగర్‌కు) చేయించుకోవాలి. షుగర్‌ బాధితులు ఫాస్టింగ్‌, పోస్ట్‌ ప్రాండియల్‌ పరీక్షలతో వ్యాధిని నిర్ధారించాలి. అనంతరం డాక్టర్‌ రోగి పరీక్ష ఫలితాలను AP -e RX APP ద్వారా అప్‌లోడ్‌ చేస్తారు. వెంటనే రోగి సెల్‌ఫోన్‌ నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌, కోడ్‌ వస్తుంది. అంతే... రోగి లబ్ధిదారుడుగా ఎంపికైనట్లే. ఈ కోడ్‌ను చూపి రిటైల్‌ మెడికల్‌ షాపునకు వెళ్లి మందులు తీసుకోవచ్చు. ఒకసారి నెలకు సరిపడా మందులు ఇస్తారు. రోగులను ఈ పథకంలో లబ్ధిదారులుగా చేర్చేందుకు వారి ఆధార్‌ నంబర్‌, ప్రజా సాధికార సర్వే వివరాలను అనుసంధానం చేస్తారు. ప్రజా సాధికార సర్వేలో నమోదు కాని వారు తమ సమీపంలో ఉన్న మీ సేవ కేంద్రంలో సంప్రదించాలి.

anna sanjeevini 09022019

మందుల దుకాణాలు ఇలా చేయాలి... ఇక ఈ పథకం కింద రోగులకు మందులు విక్రయించాల్సిన రిటైల్‌ మెడికల్‌ దుకాణాల వారు మొదట అదే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అనంతరం తాము విక్రయించే మందులను బిల్లు, రోగి కోడ్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి. ప్రభుత్వం వారానికి ఒకసారి ద్వారా మందుల దుకాణాలకు ఆన్‌లైన్‌ పేమెంట్‌ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీ ఎంఎస్‌డీఈసీ) బిల్లులను, చెల్లింపులను పర్యవేక్షిస్తుంది. బీపీ, షుగర్‌ రోగులకు అందించే మందుల వివరాలను, ఆయా మందులకు ప్రైవేటు మెడికల్‌ దుకాణాలకు ప్రభుత్వం చెల్లించే ధరలను ప్రకటించారు. ప్రభుత్వాస్పత్రులకు సరఫరా చేసేందుకు ఏపీ ఎంఎస్‌ఐడీసీ సంస్థ చెల్లించే రేటును ఇందుకు ప్రామాణికంగా తీసుకున్నారు.

Advertisements

Latest Articles

Most Read