తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ మరోసారి అన్నారు. కాగా దీనిపై చంద్రబాబు స్పందించారు. కేసీఆర్ తనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటున్నారని, అయితే అది ఇప్పటికే వైసీపీ నేతలకు ఇచ్చారని అన్నారు. ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ నేతలకు కాంట్రాక్టుల రూపంలో కేసీఆర్ చాలా గిఫ్ట్‌లు ఇచ్చారని, దీనితో పాటు డబ్బులు ఇచ్చారని ఆయన ఆరోపించారు. కేసీఆర్‌కు బీజేపీ, మోదీ ఆదర్శమని చంద్రబాబు ఆరోపించారు. డొంక తిరుగుడు రాజకీయాలు కేసీఆర్ మానుకోవాలని సూచించారు. ఒడిశా, బెంగాల్‌ వెళ్లిన కేసీఆర్‌కు ఏమీ జరగకపోవడంతో ఇలా మాట్లాడుతున్నారని అన్నారు.

return 31122018

తనని, మోదీని కేసీఆర్ తిట్టారని.. నోరు ఉందికదా అని ప్రతి ఒక్కరిని ఇలా తిడితే ఎలా అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ లాంటి చాలా వ్యవహారాలు ఉన్నాయని, కేసీఆర్ బ్లాక్‌మెయిలింగ్‌కు భయపడేది లేదని పేర్కొన్నారు. తాను నిప్పులా బతికానని, రాష్ట్రం కోసం నిరంతరం ఫైట్ చేస్తానని చంద్రబాబు అన్నారు. నోరుందని పారేసుకోకూడదని హితవు పలికారు. ఏపీలో మోదీ, జగన్‌, కేసీఆర్‌ కలిసి పోటీ చేస్తానంటే చేయండి.. అంతేగానీ దాగుడు మూతలు ఎందుకు అని ప్రశ్నించారు. కేసీఆర్‌ మిడిల్‌ మోదీ అయితే, జగన్‌ జూనియర్‌ మోదీ అని ఎద్దేవాచేశారు. ప్రజావేదికలో ఎనిమిదో శ్వేతపత్రం విడుదల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. శనివారం మీడియాతో సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయన ఈ సందర్భంగా మోదీ, కేసీఆర్‌, జగన్‌పై విమర్శలు గుప్పించారు. తనకు చేసింది చెప్పడమే అలవాటు అని, పద్ధతిలేని రాజకీయాలు ఏనాడు చేయలేదని తెలిపారు.

return 31122018

‘‘కేసీఆర్‌ ఎక్కడి నుంచి వచ్చారో ఒక్కసారి తెలుసుకోండి. 2004లో కాంగ్రెస్‌తో, 2009లో తెలుగుదేశంతో పొత్తు కేసీఆర్‌ పెట్టుకోలేదా? తెలంగాణ ఇస్తే పార్టీని కాంగ్రెస్‌లో కలిపేస్తానని చెప్పారు. మరి ఏం చేశారు. ఎప్పటికి ఏది దొరికితే అది కేసీఆర్‌ మాట్లాడతారు. ఏపీకి వచ్చి మోదీ, జగన్‌, కేసీఆర్‌ కలిసి పోటీ చేయండి. దాగుడుమూతలు ఎందుకు? ఇక్కడున్న వారు కేసీఆర్‌కు కావాలి. మళ్లీ ఆంధ్రవాళ్లను తిట్టాలి. ఇదేం రాజకీయం. మోదీ నమ్మించి మోసం చేయడం వల్లే వ్యతిరేకించాం. అవిశ్వాస తీర్మానం, హోదా విషయంలో కాంగ్రెస్‌ సహకరించింది. అందుకే కాంగ్రెస్‌తో కలిశాం.

ఏపీలో సచివాలయం నిర్మాణానికి ముప్పై మూడు వేల ఎకరాలను రైతులు ఇచ్చారని, తనపై విశ్వాసంతోనే వారు ఇచ్చిన విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. ఈ విషయమై కూడా కేసీఆర్ విమర్శలు చేస్తున్నారని, దీని నిర్మాణానికి రూ.250 కోట్లు అయితే సరిపోతుందంటున్న ఆయన ఇంటికి మాత్రం రూ.300 కోట్లు కావాలా? అని ఘాటుగా ప్రశ్నించారు. ప్రజలకు ఒక పవిత్రమైన దేవాలయం సెక్రటేరియట్ అని, దాన్ని చూడగానే గౌరవం కలిగేలా ఉండాలని అన్నారు. కేసీఆర్ కు ఎక్కువ మెచ్యూరిటీ ఉందని మోదీ ఇటీవల చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రస్తావించారు.

kcr amaravat 311122018

‘ఆ మెచ్యూరిటీ ఏంటంటే.. ఇద్దరు ఎంపీలతో తెలంగాణ సాధించడం. ఎంత తెలివైన వాడండి! కాంగ్రెస్ పార్టీకి ఏం చెప్పాడండి? తెలంగాణ రాష్ట్రం ఇవ్వగానే కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ ను కలిపేస్తానని చెప్పారు. అదే ఆయన మెచ్యూరిటీ’ అని చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘మోదీ గాడు’ అంటే మోదీకి బాధ లేదు.. అంటే, దాని అర్థమేంటి? లాలూచీ రాజకీయాలేగా? అని విమర్శించారు. ఇష్టపడే ఇద్దరూ తిట్టుకుంటున్నారని, మళ్లీ ఇధ్దరూ కలిసి కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని ఆరోపించారు. తనకేమో భాష రానట్టు.. కేసీఆర్ కు ఏదో బాగా వచ్చన్నట్టు, ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో చదువుకుని వచ్చినట్టు మాట్లాడుతున్నాడని సీఎం చంద్రబాబు విమర్శలు చేశారు. అమరావతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘నాతో ‘జై తెలంగాణ’ అనిపించానని అంటున్నాడు. ఆయన అనిపించడమేంటి? తెలంగాణతో నేనెప్పుడు విభేదించాను?

kcr amaravat 311122018

ఆ రోజున రాష్ట్రం కోసం సంపద సృష్టించాను. విభజన కారణంగా ఆ సంపద ఇంకో రాష్ట్రానికి పోయినప్పుడు చాలా మంది నన్ను ‘మీకు బాధగా ఉందా?’ అని అడిగారు. నేను చెప్పాను, ‘నా కెప్పుడూ బాధ లేదు. తెలుగు జాతి కోసం సంపద సృష్టించాను.. ఎంజాయ్ చేస్తారు. భగవంతుడు నాకు శక్తిని ఇచ్చాడు. హైదరాబాద్ కు ఈక్వల్ గా అభివృద్ధి చేస్తాను’ అని చెప్పాను. నరేంద్ర మోదీ పన్నెండు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ముఖ్యమంత్రిగా ఏం చేశారు? ఏమీ చేయలేదు. అహ్మదాబాద్ లో ఏముంది? ఒక్క ఐటీని ప్రమోట్ చేయలేక పోయారు. నాలెడ్జి ఎకానమీ ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు, ఆంధ్రప్రదేశ్ లో ఒక్క నాలుగేళ్లలోనే ఎకో సిస్టమ్ క్రియేట్ అవుతోంది. హార్డ్ వేర్, ఎలక్ట్రానిక్స్,ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్, ఇండస్ట్రీస్ అన్నీ వస్తున్నాయి. వీళ్లు నన్ను ఇబ్బంది పెట్టి ఎట్టి పరిస్థితిలో అమరావతి రాకుండా ఉండాలని ప్రయత్నం చేశారు. ఈరోజున వారు డబ్బులు ఇవ్వకపోయినా అమరావతి రియాల్టీ అవుతుంది. వాళ్లకు అసూయ. ప్రధానమంత్రి మన మీద చాలా కక్ష గట్టారు’ అని బాబు విమర్శించారు.

శనివారం నాడు చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. జగన్, కేసీఆర్ సంబంధాల పై మాట్లాడారు. ఈ సందర్భంగా, ఒక తెలుగువాడు ఓ బ్యూటీఫుల్ ట్వీట్ చేశాడు. ‘అవును.. అసెంబ్లీ వదిలేసి ప్రజా సమస్యలు పట్టకుండా, కేసీఆర్ తో చెట్టాపట్టాల్ వేసుకుని హైదరాబాద్ లో ఉంటూ, వారానికి నాలుగు రోజులు మార్నింగ్ వాక్ చేస్తూ, బీజేపీ చెప్పినట్టు నాటకాలాడుతూ, కేసుల మాఫీ కోసం మోదీ చుట్టూ తిరుగుతూ, తుపాన్ బాధితులను పరామర్శించేందుకు కూడా మనసు రాని లక్షకోట్ల దోపిడీదారు.. దగ్గరి రాష్ట్రాన్ని పసిబిడ్డలా సాకుతున్న చంద్రబాబు పరిపాలనంటే ఏమిటో నేర్చుకోవాలోయ్, కలికాలం అంటే ఇదే మరి! కేసీఆర్ ‘తాన’ అంటే జగన్ ‘తందానా’ అనకపోతే మోదీకి కోపం రాదు?’ అని ఆ ట్వీట్ ను చదువుతూ చంద్రబాబు నవ్వులు చిందించారు.

tweet 31122018

మోదీ కోసం వీళ్లందరూ కలిసి పనిచేస్తున్నారని, ఇది కామన్ మ్యాన్ స్పందన. ఈ సందర్భంగా కేసీఆర్ ను విమర్శిస్తూ సామాజిక మాధ్యమంలోని ఓ ట్వీట్ ని చంద్రబాబు చదివి వినిపించారు. ‘అక్కడ మొక్కుడు, ఇక్కడ మొరుగుడు, ఫామ్ హౌస్ లో తాగుడు..’ అంటూ ఆ ట్వీట్ ని చదివారు. నిన్న కేసీఆర్ తనపై దారుణంగా మాట్లాడారని.. ఇది మంచి పద్ధతి కాదని సీఎం చంద్రబాబు హితవు పలికారు. అమరావతిలో నిర్వహిస్తున్న మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ హుందాతనం లేకుండా, పద్ధతి లేకుండా అసభ్యకరమైన భాష మాట్లాడారని, దీనిని ఖండిస్తున్నానని అన్నారు. ఇంత హుందాతనం లేకుండా మాట్లాడటం, నోటికొచ్చినట్టు మాట్లాడటం సబబు కాదని అన్నారు.

tweet 31122018

తానెప్పుడూ పద్ధతి లేని రాజకీయాలు చేయలేదని, విలువలతో కూడిన రాజకీయాలు చేశానని, ఎప్పుడూ హుందాతనాన్ని కోల్పోయి మాట్లాడలేదని స్పష్టం చేశారు. తననే కాదు, కాంగ్రెస్ పార్టీని, మోదీపైనా కేసీఆర్ దారుణంగా మాట్లాడుతున్నారని దుమ్మెత్తిపోశారు. రాజకీయాల్లో కొంత హుందాతనం, విలువలు ఉంటాయని, అధికారంలో ఉండే వ్యక్తులు చాలా హుందాగా వ్యవహరించాలని సూచించారు. నాగరిక ప్రపంచం ఆయన తీరును మెచ్చుకోదని, నోరుంది కదా అని ఇష్టానుసారం మాట్లాడటం పద్ధతి కాదని అన్నారు.

తనను విమర్శిస్తూ కేసీఆర్ అక్కడ మాట్లాడితే, జగన్ ఇక్కడ ట్వీట్ చేస్తాడని, వీళ్లిద్దరినీ అభినందిస్తూ నరేంద్ర మోదీ ఫోన్ చేస్తారని ఏపీ సీఎం చంద్రబాబు ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. అమరావతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఫెడరల్ ఫ్రంట్ లో చేరతానని కేసీఆర్ చెబుతున్నాడని, ’చేరండి.. నేషనల్ ఫ్రంట్ లో చేరండి.. డెమోక్రటిక్ అలయెన్స్ లో చేరండి.. బ్రహ్మాండం.. మేము కాదంటామా?’ అని సెటైర్లు విసిరారు. తన కథ మీకెవరికీ అర్థం కాదని, రాబోయే రోజుల్లో హైకమాండ్ స్కీమ్ అర్థమవుతుందని కేసీఆర్ అంటున్నారని, ఎన్నికలు అయ్యే వరకు అది ఎవరికీ అర్థం కాదుట అంటూ సెటైర్లు విసిరారు.

mugguru 311122018

కేసీఆర్ ఓ స్ట్రాటజిస్ట్ అని, అయితే ఆ స్ట్రాటజీలు, కుట్రలు, కుతంత్రాలు అన్నివేళలా పనిచేయవని విమర్శించారు. ‘మిమ్మల్ని మానసికంగా దెబ్బతీసేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా?’ అని ప్రశ్నించగా, ‘నన్ను మానసికంగా ఎవరు దెబ్బతీస్తారు? నన్ను మానసికంగా దెబ్బతీసే శక్తి ఎవరికీ లేదు. ఎన్నో సంక్షోభాలు చూశాను’ అని ఆయన సమాధానమిచ్చారు. హుందాగా వ్యవహరించడాన్ని చేతగానితనంగా తీసుకోవద్దని, ఇష్టానుసారం మాట్లాడొద్దని కేసీఆర్ కు చంద్రబాబు హితవు పలికారు. ఎన్టీఆర్ దగ్గర నుంచి టీడీపీని తాను లాక్కున్నానని సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ‘నేనేదో ఎన్టీఆర్ దగ్గర నుంచి పార్టీ లాక్కున్నానట! అప్పుడు నువ్వెక్కడున్నావు? నాతోనే ఉన్నారు కదా? ఏం మాట్లాడుతున్నారు? ఆ తర్వాతే కదా మీరు మంత్రి అయ్యారు? వైస్రాయ్ హోటల్ సిద్ధాంత కర్త ఆయనే కదా. నడిపించిందే ఆయన, ఆ విషయాలు ఆయనకు తెలియదా?’ అని ప్రశ్నించారు.

mugguru 311122018

‘హరికృష్ణ చనిపోయినప్పుడూ అంతే. ఆసుపత్రి, పోస్టుమార్టమ్, బరియల్ గ్రౌండ్ ఏర్పాటు చేయమని కోరాం. అందులో తప్పేముంది?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కారం చేసుకుని, ముందుకుపోదామని తాను కోరానని, దాన్ని వదిలిపెట్టి, కనీసం ఒక్కరోజు కూడా కేసీఆర్ సహకరించలేదని, ఏపీకి కేంద్రం కూడా సహకరించట్లేదని బాబు విమర్శలు గుప్పించారు. నోరుందని పారేసుకుంటే అందరూ పారేసుకోవచ్చని... హుందాతనం అనిపించుకోదన్నారు. కొన్ని విలువలు ఉంటాయని.. అధికారంలో ఉండే వ్యక్తులు హుందాగా మాట్లాడాలన్నారు. అసభ్యంగా మాట్లాడారని విమర్శించారు. విధానాలను విమర్శించుకోవచ్చన్నారు. ‘‘నా రాజకీయ జీవితమంతా.. చేసింది చెప్పడం.. ప్రజలను చైతన్యపరచడం లాంటివి మాత్రమే చేశానన్నారు. రాజకీయ విలువను పాటించాను. సంయమనంతో వెళ్లాను. చులకనగా మాట్లాడినా.. హేళన చేసినా... కానీ ఎక్కడా రాజీపడలేదు. కేసీఆర్ ఎక్కడ నుంచి ఊడిపడ్డారు. టీడీపీ నుంచి కాదా... రాజకీయ జీవితం ఇవ్వలేదా... నోటికొచ్చినట్టు మాట్లాడారు. పద్ధతిలేని విధానమా ఇది. ఉద్యమం ప్రారంభించి కాంగ్రెస్‌తో జట్టుకట్టారు. ఆ తర్వాత 2009లో సీట్లు ఇవ్వనంటే పరిగెడుతూ వచ్చి ఎన్ని సీట్లంటే అన్ని సీట్లు తీసుకున్నావు. అది నిజం కాదా..? తెలంగాణ ఇస్తే.. కాంగ్రెస్‌లో కలిపేస్తా అన్నారు. ఆ తర్వాత ఏం చేశారు. ఇప్పడు ఇడియట్స్ అంటూ పద్ధతి లేకుండా మాట్లాడతున్నారు. రాజీవ్ గాంధీ ఐటీని తీసుకొచ్చిన విషయం నిజమే.. మరి జనార్దన్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చారు. 1995 నుంచి నాతో పాటు మీరే ఉన్నారు కదా... మీకు తెలియదా? జన్మభూమి గురించి ఊరూరూ పోయి.. పొగిడి.. ఇప్పుడేం మాట్లాడుతున్నారు?’’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.

 

Advertisements

Latest Articles

Most Read