బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హ-త్య కేసు విచారణకి అబ్బాయి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహకరిస్తే, ఈ కేసు మిస్టరీ వీడిపోతుందని వివేకా హ-త్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే ఇంతవరకూ తన బాబాయ్ హ-త్యకేసులో విచారణ ముందుకు సాగడానికి అబ్బాయి సహకరించడంలేదని స్పష్టం అవుతోంది. మొదట్లో గుండెపోటు అని, ఆ తరువాత గొడ్డలిపోటు అని, అదీ నారాసురరక్త చరిత్ర అని ప్రచారం చేసింది జగన్ క్యాంప్. సీబీఐ ఎంక్వైరీ కోరడం, ఆ తరువాత వారే వద్దనడం, దర్యాప్తునకు వచ్చిన సీబీఐపై దా-డు-లు..నిందితులు, అనుమానితుల్ని వైఎస్ జగన్ వెనకేసుకు రావడమే కాదు వారిని కాపాడుతుండడంతో అనుమానాలు తీవ్రం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సీబీఐ ఏకంగా తాడేపల్లి ప్యాలెస్లో సీఎం జగన్, ఆయన భార్య భారతి ఫోన్ కాల్స్ గురించి సీబీఐ ఆరా తీసిన నేపథ్యంలో వివేకా హ-త్య కేసులో త్వరలో నిజానిజాలు తేలే రోజు దగ్గర పడిందని దస్తగిరి చెప్పుకొచ్చాడు. ఇంతకాలం నేను చెప్పింది అబద్ధాలంటూ కొందరు మాట్లాడారని, ఇటీవల కొందరిని సీబీఐ విచారించిందంటే, వారికి సమాచారం ఉండకుండా చేయరు కదా అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏపీలో విచారణకు జగన్ సహకరించి ఉంటే పది రోజుల్లోనే వివేకా హ-త్య కేసు పూర్తయ్యేదని మరో పెద్ద బాంబు పేల్చాడు.
news
వైసీపీ తుఫాన్ నెల్లూరు వద్ద తీరం దాటి కర్నూలుని తాకింది
వైసీపీలో రాష్ట్రమంతా అసంతృప్తి సెగలు కక్కుతున్నా నెల్లూరులోనే మొదట బయటపడింది. ఇది నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యేలను దూరం చేసుకోవడానికి సిద్ధమైంది. ఆ దిశగా చర్యలు మొదలు పెట్టేశారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి, నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలను వైసీపీ జాబితా నుంచి తీసేసింది. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని మొదటి నుంచీ వైసీపీ దూరం పెట్టింది. ఈ తిరుగుబాటు తుఫాన్ ఇప్పుడు కర్నూలుని తాకింది. ఏకంగా టిడిపి నేతలే వైసీపీ ఎమ్మెల్యేలు టిడిపిలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించడం సెన్సేషన్ అవుతోంది. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి టిడిపిలో చేరాలని తహతహలాడుతున్నారని, మాజీ మంత్రి అఖిలప్రియ వ్యాఖ్యలు రాజకీయ వేడి రగిల్చాయి. మరోవైపు నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే బాబాయ్ శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి కూడా టిడిపితో టచ్లో ఉన్నాడని వైసీపీ అనుమానిస్తోంది. గతంలో టిడిపిలో ఉన్న శిల్పా చక్రపాణిరెడ్డి వైసీపీలో చేరారు. ఏపీ టిడిపి అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడుతో శిల్పా వాళ్లకు సత్సంబంధాలున్నాయనేది బహిరంగ రహస్యం. వైసీపీ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడుతుందని వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఆరోపించారు. శిల్పా వాళ్ల ఫోన్లు ట్యాప్ అయ్యాయేమో కానీ వైసీపీ అనుమానపు చూపులు ఎక్కువయ్యాయి. శ్రీశైలం సీటు కోసం బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని వైసీపీ రెడీ చేసుకుంటోందని ప్రచారం సాగుతోంది.
సజ్జల బౌన్సర్లు.. కోటంరెడ్డి సిక్సర్లు.. వైసీపీలో ఏమి జరుగుతుంది ?
నెల్లూరు జిల్లా రాజకీయాలతో వైసీపీలో టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది. రోజుకో ప్రెస్మీట్ తో వైసీపీకి చెందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్వపక్షాన్ని ఇరకాటంలోకి నెడుతున్నాడు. నెల్లూరు వైసీపీ నేతల్ని కోటంరెడ్డిపైకి ఉసిగొల్పితే..ఒకరి బాగోతాలు ఒకరికి తెలియడంతో ఎదురుదా-డికి భయపడుతున్నారు. వారు తప్పించుకున్నా తనకు తప్పదు కదా అనే ధోరణిలో సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తనదైన శైలిలో కోటంరెడ్డిపై బురద చల్లేసి మీడియాకి వదిలేశాడు. కందిరీగ పట్టుని కదిపి వదిలినట్టయ్యింది సజ్జల ప్రెస్మీట్. సజ్జల తాను వేసిన బౌన్సర్లకి కోటంరెడ్డి హడలిపోతాడనుకుంటే..కోటంరెడ్డి ఎగిరెగిరి సిక్సులు కొట్టాడు. సజ్జల రామకృష్ణారెడ్డి భారీగా ప్యాకేజీలు తీసుకుని మంత్రి పదవులు కట్టబెట్టాడని ధ్వజం ఎత్తాడు. తాము రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు, జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ వెంటే ఉన్నామని...అప్పుడు సజ్జల తనయుడు భార్గవరెడ్డి ఎక్కడున్నాడంటూ నిలదీశాడు. సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలతోనే బోరుగడ్డ అనిల్ తనకి ఫోన్ చేసి బెదిరించాడని, భయపడేదే లేదన్నారు. నువ్వు మామూలు ఫోన్ కాల్స్ చేయిస్తావు సజ్జలా, నేను తలుచుకుంటే నీకు నెల్లూరు నుంచి వీడియో కాల్స్ వస్తాయంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ సోషల్మీడియాని తన కనుసన్నల్లోకి తెచ్చుకున్న సజ్జల తనయుడు సజ్జల భార్గవరెడ్డి తనని లక్ష్యంగా దుష్ప్రచారం చేస్తుండడాన్ని సవాల్ విసిరారు. వరస ప్రెస్మీట్లతో కోటంరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిపై విరుచుకుపడటంతో తోకముడిచి, ఇతర నేతల్ని ఉసిగొల్పుతున్నారు.
వివేకా కేసులో, నెట్టింట వైరల్ అవుతున్న అనుమానాలు.. అవినాష్ రెడ్డి వాళ్ళని ఇరికించాడా ?
ప్రస్తుతం సోషల్మీడియాలో వైఎస్ వివేకానందరెడ్డి హ-త్యకేసులో అవినాశ్ రెడ్డి విచారణ అంశాలే హైలైట్ అవుతున్నాయి. ఆంధ్రజ్యోతి రాసిన కథనంపై వైసీపీ పెద్దలు మాట్లాడుతూ బాత్రూం తొంగి విన్నాడా అంటూ వేళాకోళం చేసినా, రాసిన ప్రతీ అక్షరమూ సత్యమైంది. అవినాష్ కాల్ ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. దీనిపై వైవీ సుబ్బారెడ్డి వివరణ ఇస్తూ ``వదిన భోజనం చేసిందా? ఏం కూర వండిందో `` అని అడగడం తప్పా? అంటూ సమర్థించుకున్నారు. వేకువన 3 గంటలకి ఏ మరిదీ తన వదినకి ఇలా ఫోన్ చేసి భోజనాల గురించి, బాగోగుల గురించి అడగడు, అలాగే ఒక సారి భోజనం గురించి అడగాలి కానీ వందసార్లు ఫోన్ చేసి భోజనం గురించి అడగరు కదా అనే అనుమానాలను నెటిజన్లు రైజ్ చేశారు. వివేకా చనిపోయారని అప్పుడే తెలిస్తే వదిన, అన్నతో చాలా కష్టపడి మాట్లాడిన అవినాశ్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతకి ఎందుకు కాల్ చేసి సమాచారం ఇవ్వలేదనేది మరో అంతుబట్టని మిస్టరీ. సీఎం జగన్ మోహన్ రెడ్డికి బాబాయ్ చనిపోయాడని సమాచారం ఇస్తే, ఆయన తన భార్యకి చెబుతాడు కదా! నవీన్ కి వందసార్లకి పైగా కాల్ చేసి చెప్పాల్సిన అవసరం ఏముంది అనేది ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న అంశం...